T -20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియాపై నెగ్గిన భారత్.. చెలరేగిన పూనమ్..!

Friday, February 21st, 2020, 06:55:24 PM IST

టీ-20 మహిళా ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో భారత్ బోణీ కొట్టింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత బ్యాటర్ దీప్తి శర్మ 49 పరుగులతో రాణించింది

అనంతరం 133 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో అలిసా హీలీ 51 పరుగులు, ఆష్లీ గాడ్నర్ 34 పరుగులు చేసినప్పటికి విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో విజయంలో కీలకంగా పాత్ర పోశించిన స్పిన్నర్ పూనం యాదవ్ ఆసీస్ అమ్మాయిలను తన బంతితో దెబ్బకొట్టింది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన పూనం కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఏదేమైనా మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో భారత అమ్మాయిలకు క్రికెట్ అభిమానులు తమ ప్రశంశలతో మరింత బూస్టఫ్ ఇస్తున్నారు.