మరొక భారీ విజయాన్ని నమోదు చేసిన టీం ఇండియా

Saturday, November 16th, 2019, 05:14:05 PM IST

ఇటీవలే దక్షిణాఫ్రికా పై భారత్ అతి భారీ విజయాల్ని నమోదు చేసింది. ఎన్నో రికార్డులని మూట గట్టుకొని టీం ఇండియా సత్తా ని ప్రపంచానికి తెలిపింది. అయితే బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలిచి తన సత్తాని ప్రదర్శించింది.

భారత్ ఇచ్చిన 493 పరుగుల లక్ష్యాన్ని ఛేదించుటలో బంగ్లా తడబడిందని చెప్పాలి. మొదటి నుండి భారత్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కేవలం మూడు రోజుల్లోనే ఆటని ముగించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ ఖాతాలో మరొక 60 పాయింట్లు చేరాయి. బంగ్లా దేశ్ తోలి ఇన్నింగ్స్ 150 ఆలౌట్ కాగా, టీమిండియా తోలి ఇన్నింగ్స్ ని 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఏ మాత్రం రాణించలేక చతికిలపడి 213 పరుగులకు ఆలౌట్ అయింది.