మరో థ్రిల్లింగ్ సూపర్ ఓవర్…ఉత్కంఠ రేపిన 4వ టీ20 మ్యాచ్!

Friday, January 31st, 2020, 05:21:29 PM IST

టీమిండియా మరో అరుదైన ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టీం ఇండియా మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న విషయం అందరికి తెల్సిందే. అయితే నాల్గవ మ్యాచ్ లో రెండు టీం లు తమ అత్యుత్తమ ప్రదర్శనని కనబరిచారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ టై కావడంతో ప్రేక్షకులు సూపర్ ఓవర్ కోసం ఎదురు చూసారు. అయితే మరొకసారి టీం ఇండియా తన అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ కైవసం చేసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 165 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో మనీష్ పాండే అర్ద సెంచరీతో అదరగొట్టగా, కేఎల్ రాహుల్ 39 పరుగులతో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్, దుబే, సుందర్, కోహ్లీ విఫలమవడంతో మ్యాచ్ ఫై చాల ప్రభావం చూపించింది. అయితే బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ని టీం ఇండియా బౌలర్లు కట్టడి చేయడం తో మ్యాచ్ 20 ఓవర్లు ముగిసే సరికి టై అయింది.

ఉత్కంఠ భరితంగా సాగిన 4వ టీ 20 లో మరో సూపర్ ఓవర్ నమోదయింది. బుమ్రా అద్భుత బౌలింగ్ తో సూపర్ ఓవర్ లో వికెట్ నష్టానికి 13 పరుగులు చేయగలిగింది న్యూజిలాండ్. టీం ఇండియా వికెట్ నష్టానికి 16 పరుగులు చేసి విజయం సాధించింది. కేఎల్ రాహుల్ మొదటి రెండు బంతులని సిక్స్, ఫోర్ లతో బౌండరీలు కొట్టగా, మూడవ బాల్ కి అవుట్ అయ్యాడు. కోహ్లీ మిగతా బాల్స్ ఆడి మ్యాచ్ విజయానికి కారకుడయ్యాడు. మరి ఈ సిరీస్ ని టీం ఇండియా న్యూజిలాండ్ ఫై క్లీన్ స్వీప్ చేసి సాధిస్తుందో లేదో చూడాలి.