డిసైడింగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Saturday, February 8th, 2020, 08:27:09 AM IST

న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక రికార్డుని నెలకొల్పింది టీం ఇండియా. అయితే మూడు వన్డేల సిరీస్ లో మొదట మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించినప్పటికీ దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. అయితే డిసైడింగ్ రెండో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మూడు వన్డేల సిరీస్ ని దక్కించుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే జట్టు విషయం లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని మార్పులు చేసాడు. మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో నవదీప్ సైని ని తీసుకున్నాడు. అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫై వేటు వేసి చాహల్ ని రెండో వన్డే మ్యాచ్ లో తీసుకున్నాడు. ఆ సిరీస్ అనంతరం టీం ఇండియా ఇదే న్యూజిలాండ్ టీం తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. మరి విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ రెండు మార్పులు టీం ఇండియా విజయానికి దోహదపడతాయో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.