గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ – షాక్ లో టీమిండియా

Monday, February 3rd, 2020, 11:16:40 PM IST

టీమిండియా జట్టుకి తాజాగా మరొక షాక్ తగిలింది…. కివీస్ తో జరగనున్నటువంటి వన్డే సిరీస్ కి ముందే టీమిండియా జట్టుకి ఇలాంటి షాక్ తగలడం అనేది కాస్త ఇబ్బంది అనే చెప్పాలి… కాగా మన భారత వన్డే వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గాయం కారణంగా కివీస్ తో జరిగే వన్డే సిరీస్‌ నుంచి వెనుదిరిగాడు… ఇకపోతే న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్ గాయం కారణంగా తీవ్రంగా గాయపడటం అందరం చూసాం కూడా… తానూ బ్యాటింగ్ క్రీజులో ఉన్నప్పుడు తన కాళీ కండరాలు ఒక్కసారిగా పట్టేయడంతో, రోహిత్ శర్మ ఆట మధ్యలోనే బయటకు వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండే నొప్పి మరింతగా ఎక్కువైందని సమాచారం.

ఇకపోతే ప్రస్తుతానికి రోహిత్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సూచనా మేరకు సరైన విశ్రాంతి అవసరమని, అందుకనే రోహిత్ స్థానంలో మరొక ఆటగాడిని తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. కాగా రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడానికి మయాంక్‌ అగర్వాల్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌లు పోటీ పడుతున్నారు. కాగా కివీస్ తో జరిగే ఈ వన్డే సిరీస్ ఈ నెల 5 న ప్రారంభం కానున్నాయి.