మొదటి సెషన్ లో టీమిండియా కు ఎదురుదెబ్బ

Saturday, October 19th, 2019, 12:21:24 PM IST

దక్షిణాఫ్రికా తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా వరుసగా వికెట్లని కోల్పోతుంది. రెండు టెస్ట్ మ్యాచుల్లో అద్భుతం గా రాణించి, ఇపుడు మూడో టెస్టులో తడబడటం తో టీం ఇండియా కష్టాల్లో పడిందని చెప్పవచ్చు. కోహ్లీ అవుట్ తో టీం ఇండియా కష్టాల్లో ఉందని తెలుస్తుంది. మయాంక్ అగర్వాల్, పుజారా, విరాట్ కోహ్లీ స్వల్ప స్కోర్ కే ఔటయ్యారు. ప్రస్తుతానికి రోహిత్ శర్మ ,మరియు అజింక్య రహానే క్రీజులో వున్నారు.

భారత్ తొలి రెండు టెస్ట్ మ్యాచుల్లో అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికా ని చిత్తుచిత్తుగా ఓడించింది. వైట్వాష్ దిశగా ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఫలితాలు మాత్రం అలా కనిపించడం లేదు. మూడో టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్ రబాడ తొలి రెండు వికెట్లు తీయగా, కోహ్లీ నోర్జె 16 వ ఓవర్లో ఎల్బీ అయ్యాడు. రోహిత్ శర్మ, రహానే ల బ్యాటింగ్ పైనే టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలనుంది. మరి రోహిత్ మొదటి టెస్ట్ మ్యాచులో రాణించడమే కాకుండా రెండు శతకాలు బాదాడు. మరి ఎంతవరకు రాణిస్తారనేది వేచి చూడాలి.