బ్రేకింగ్: భారీ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించిన టీమిండియా!

Friday, January 24th, 2020, 04:23:01 PM IST

టీమిండియా తో జరిగిన తోలి టీ20 లో భారత్ శుభారంభాన్నిచ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియాకు న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఓవర్ కు కనీసం 10 పరుగుల చొప్పున స్కోర్ బోర్డ్ ని పరుగులెత్తించిన న్యూజిలాండ్ 203 పరుగులు చేసింది. అయితే కెప్టెన్ కేన్ విలియంసన్ అద్భుత బ్యాటింగ్ తో కేవలం 26 బంతుల్లోనే 51 పరుగులు చేసాడు. రాస్ టేలర్ 27 బంతుల్లో (54 పరుగులు) అద్భుత హాఫ్ సెంచరీ చేసాడు. మున్రో 59 పరుగులు, గుప్తిల్ 30 పరుగులు చేసి, భారీ సిక్స్ కి ప్రయత్నించగా ఔటయ్యాడు. భారత్ కి భారీ లక్ష్యాన్ని ఇచ్చిన న్యూజిలాండ్ టీమిండియా బ్యాట్స్ మెన్ దాటికి తట్టుకోలేకపోయింది.

రోహిత్ శర్మ ఆదిలో నిరాశపరిచినప్పటికీ, కేఎల్ రాహుల్ 27 బంతుల్లో (56, 4X4, 3X6) అద్భుత హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. కేఎల్ రాహుల్ కి తోడుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 45 పరుగులు చేసాడు విరాట్. అయితే వీరి తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుత హాఫ్ సెంచరీ తో జట్టు ని విజయమార్గం లో నడిపించాడని చెప్పాలి. 29 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సులతో 58 పరుగులు చేసాడు. అయ్యర్ కి జతగా మనీష్ పాండే 14 పరుగులు చేసి టీం ఇండియా విజయం లో కీలక పాత్ర పోషించారు. 19 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించి సునాయాసంగా గెలిచింది.