మరొక షాక్ ఇచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్

Friday, August 23rd, 2019, 11:37:46 PM IST

ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుండి కూడా స్వతంత్రంగా తప్పుకున్నటువంటి టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు తాజాగా మరొక సంచలనానికి తెరలేపాడు. కాగా ప్రపంచ కప్ సమయంలో తానూ ఇక క్రికెట్ నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించుకున్న అంబటి రాయుడు, ఇక తాను తన రిటైర్మెంటుని వెనక్కి తీసుకోనున్నాడని సమాచారం. అందుకోసం ఇప్పటికే సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపాడని సమాచారం. కాగా ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచులు అన్ని ముగిశాక, ఇక భారత్‌ తరుఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నాడంట. చివరికి మళ్ళీ అంబటి రాయుడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తిరిగి అడుగుపెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

కాగా గత రెండు ఏళ్లుగా టీమిండియా తరపున నిలకడగా ఆడుతూ, చక్కటి ప్రదర్శనని కనబరిచినటువంటి అంబటి రాయుడిని ఇటీవల జరిగినటువంటి ప్రపంచ కప్ కి సెలెక్టు చేయలేదు. దీంతో అసంతృపితికి గురైన అంబటి రాయుడు, ఇక ప్రపంచ కప్ ఆటను వీక్షించడానికి తాను 3D అద్దాలు కొనుగోలు చేస్తానని అధికారికంగా ట్వీట్ చేశారు. తనని సెలెక్టు చేయకపోవడంతో భావోద్వేగానికి గురైన అంబటి రాయుడు తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించారు. కాగా మళ్ళీ ఈ ఆటలోకి రాడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు.