కొత్త యూనిఫాం తో బరిలోకి దిగనున్న టీమిండియా

Tuesday, June 4th, 2019, 06:00:16 PM IST

మన టీమిండియా నేడు ప్రపంచకప్ లో మొదటి మ్యాచ్ ఆడనుంది… ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా అడుగుపెట్టనుంది. కాగా మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఢీకొట్టనుంది. కాగా ఈ మ్యాచ్ల్లో మన టీమిండి కొత్త దుస్తులలో మెరవనుంది. ఇప్పటివరకు కూడా టీమిండియా అనగానే బ్లూ కలర్ యూనిఫాం అని ఎవరైనా చెప్పేస్తారు. కాగా తొలిసారిగా భారత క్రికెటర్లు మరో రంగు దుస్తుల్లో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే వారు కొత్తగా ఆరంజ్ కలర్ దుస్తుల్లో కనిపిస్తారు. అది కూడా కెన్నీ మ్యాచ్ లకు మాత్రమే అని సమాచారం. అయితే అవేమి మ్యాచ్ లు అనేది ఇంకా తెలిసిరాలేదు… మొత్తానికి మన ఆటగాళ్లు చాలా రోజుల తరువాత కొత్త రంగు దుస్తుల్లో బరిలోకి దిగనున్నారు. మరి ఈ కొత్త రంగు దుస్తుల్లో మన కోహ్లీ సేన ఎలా కనిపించనుందో అని అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి మన టీం కూడా ఫెవరేట్ అనే చెప్పాలి. ఎందుకంటే మన ఆటగాళ్లు మునుపటి కంటే కూడా చాలా మెరుగైన ఆటని ప్రదర్శిస్తున్నారు. ఈసారి ప్రపంచకప్ కే అందరు యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనున్న టీమిండియా ఎంతమేరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుందో చూడాలి.