అండర్-19 వరల్డ్ కప్: టీమిండియాతో ఫైనల్స్‌లో తలపడే జట్టు ఇదే..!

Thursday, February 6th, 2020, 11:09:55 PM IST

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్ ఈ ఆదివారం జరగబోతుంది. అయితే సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుని తొలుత ఫైనల్స్‌లోకి టీమిండియా అడుగుపెట్టింది. అయితే టీమిండియాతో ఫైనల్స్‌లో ఏ జట్టు తలపడుతుందో అనే ఉత్కంఠకు నేడు తెరపడింది. టీమిండియాతో ఫైనల్స్‌లో బంగ్లాదేశ్ తలపడనుంది.

అయితే నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య రెండో సెమీస్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 44.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లా నెగ్గడంతో ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పటికే మంచి ఊపుమీదున్న టీమిండియా బంగ్లా పులులను ఎదురుకుని నిలబడి కప్ గెలుస్తుందా లేదా అనేది ఈ ఆదివారం తేలిపోనుంది.