అండర్19 సెమీస్: కుప్పకూలిన పాక్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ లక్ష్యం 173..!

Tuesday, February 4th, 2020, 05:19:27 PM IST

అండర్ 19 ప్రపంచకప్ సెమీఫైనల్స్ భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్‌ల మధ్య హోరాహోరీగా సాగుతుంది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. 43.1 ఓవర్లలోనే 172 పరుగులకే పాక్‌ను భారత్ ఆలౌట్ చేసింది. ఓపెనర్ హైదర్ అలీ 56 పరుగులు (77 బంతులలో) చేయగా, మంచి ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ మహమ్మద్ హురైరా కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన వారిలో కెప్టెన్ నజీర్ 62 పరుగులు (102 బంతులలో), హారీస్ 21 పరుగులు (15 బంతులలో) చేయగా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్‌లోనే పెవిలియన్ చేరుకున్నారు.

అయితే భారత బౌలర్లలో ఎస్ఎస్ మిశ్రా మూడు వికెట్లు తీయగా, కార్తీక్ త్యాగి, రవి బిష్నోయ్ చెరో రెండు వికెట్లు, అంకోలేకర్, జైశ్వాల్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో కనుక భారత్ నెగ్గితే నేరుగా ఫైనల్స్‌లో అడుగుపెట్టబోతుంది. అయితే ఇప్పటివరకు అండర్‌-19 వరల్డ్ కప్‌లో టీమిండియా‌, పాకిస్తాన్‌ల మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరగగా అందులో భారత్‌ 4 ‎విజయం సాధించగా, 5 మ్యాచ్‌లో పరాజయం పాలైంది.