డోంట్ మిస్: ప్రపంచ రికార్డుని క్రియేట్ చేసిన “ఉమేష్ యాదవ్”

Sunday, October 20th, 2019, 05:23:19 PM IST

దక్షిణాఫ్రికా తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఏ ఒక్కరు నమోదు చేయలేని 310 స్ట్రైక్ రేట్ నమోదు చేసి సరి కొత్త రికార్డుని నెలకొల్పాడు. పది బంతులకు గానూ 31 పరుగులు తీసిన ఉమేష్ అందులో 5 సిక్సులను కొట్టడం గమనార్హం. మొత్తం గా 310 స్ట్రైక్ రేట్ తో ఔరా అనిపించాడు. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచుల్లో విజయం సాధించి వైట్ వాష్ దిశగా పరుగులు తీస్తుంది.

అయితే మూడో టెస్ట్ మ్యాచులో రోహిత్, రహానే రాణించడం తో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. 497/9 పరుగుల వద్ద భారత్ మొదటి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా 9/2 తో వుంది. భారత్ తన ఆధిపత్యాన్ని బాటింగ్ విభాగంలో, మరియు బౌలింగ్ విభాగంలోనూ రాణించడంతో మూడో టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.