టెస్టుల్లో కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించిన కోహ్లీ… భారత్ తొలి ఇన్నింగ్స్ 601/5 డిక్లేర్డ్

Friday, October 11th, 2019, 04:57:54 PM IST

దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. మొదటి టెస్టులో రోహిత్, మయాంక్ అగర్వాల్ అదరగొడితే, రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ తో చితకొట్టేశాడు. 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ కెరీర్ అత్యుత్తమ స్కోర్ 243 ఉండగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో దాటేశాడు. త్రిశతకాన్ని త్యాగం చేసి, భారీ స్కోర్ వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసాడు విరాట్ కోహ్లీ.

జడేజా 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఇది కెరీర్ అత్యుత్తమం కాగా, టీం ఇండియా కి సారధిగా వహించిన వారిలోను ఇదే అత్యుత్తమం. అంతే కాకుండా విరాట్ కోహ్లీ సారథ్యం లో టీం ఇండియా 600 పరుగులు చేయడం ఇది పదోసారి. విరాట్ తన విధ్వంసకర బాటింగ్ తో ప్రత్యర్థులకు కంటి మీద కునుకు ఉండదు అని చెప్పవచ్చు. విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం తన బాటింగ్ స్టైల్ కి ముగ్దులైపోతున్నారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ అభిమానులను సైతం అలరిస్తున్నాడు.