బ్రేకింగ్: ద్విశతకం తో అదరగొట్టిన కోహ్లీ…మరో రికార్డు!

Friday, October 11th, 2019, 04:03:50 PM IST

దక్షిణాఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పరుగుల వరదను పారిస్తున్నాడు. 295 బంతుల్లో 200 పరుగులు తీసి మరొక మైలు రాయిని చేరుకున్నారు. ఈ ద్విశతకం తో ఏడు వేల పరుగుల మైలు రాయిని చేరుకోవడం విశేషం అని చెప్పాలి. రహానే అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా తో కలిసి 107 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు విరాట్ కోహ్లీ. తన బాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ బౌండరీలు బాదుతూ భారీ స్కోర్ దిశగా భారత్ పరుగులు తీస్తుంది.

విరాట్ కోహ్లీ ఇదే దూకుడు కొనసాగిస్తే సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులని సైతం బద్దలు కొట్టగలడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. వన్డేల్లో, టెస్టుల్లో కలుపుకొని విరాట్ కోహ్లీ కి ఇది 69 వ శతకం అని తెలుస్తుంది. ప్రపంచ క్రికెట్ అభిమానులు కోహ్లీకి అభినందనలు తెలుపుతున్నారు. కోహ్లీ ద్విశతకం తో భారత్ భారీ స్కోర్ ని సాధించడమే కాకుండా టీం ఇండియా గెలుపులో కీలకం కానుందని అభిమానులు భావిస్తున్నారు.