టెస్టుల్లో ధోని రికార్డులని దాటేసే దిశగా విరాట్ కోహ్లీ.

Monday, August 26th, 2019, 11:12:43 AM IST

ప్రస్తుతం విండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో 1-0 తో ముందంజలో వున్న టీమిండియా, ఇంకొక్క మ్యాచ్ గెలుపుతో ధోనిని దాటనున్నాడు. ప్రస్తుతానికి 27 మ్యాచ్ల విన్నింగ్ కెప్టెన్గా ధోని వున్నాడు. విండీస్ తో జరిగిన మ్యాచ్ తో ధోని రికార్డులను సమం చేసి ధోని సరసన చేరాడు. మొత్తం 47 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ 27 విజయాలను నమోదు చేసాడు. 10 మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వగా. పది మ్యాచ్ లు డ్రా గా ముగిసాయి. ధోని 27 విజయాలు అందించడానికి 60 మ్యాచ్లు ఆడాడు. అప్పట్లో టీమిండియా కి అత్యుత్తమ కెప్టెన్ గా అజారుద్దీన్ పేరు ఉండేది.

అజారుద్దీన్ విజయ శాతం ఎక్కువగా ఉండేది. అజారుద్దీన్ ని గంగూలీ క్రాస్ చేయగా, ధోని వాటి దగ్గర వరకు వచ్చి ముందంజ లో వున్నాడు. ప్రస్తుతం కోహ్లీ వాటిని అధిగమించేందుకు సిద్ధంగా వున్నాడు. వన్ డే మ్యాచ్ ల్లో మాత్రమే కాకుండా, టెస్టు మ్యాచ్ ల్లో కూడా విరాట్ తన విజయ పరంపరను కొనసాగిస్తున్నాడు. మరిన్ని రోజుల్లో మరి కొన్ని రికార్డు లను బద్దలు కొట్టడానికి రెడీ గ ఉన్నట్లు తెలుస్తుంది. టీమిండియా కి ఇన్ని విజయాలు అందిస్తున్న విరాట్ కి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెప్పాల్సిందే.