డోంట్ మిస్: సచిన్, కోహ్లీ ల ఫై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Wednesday, March 4th, 2020, 07:22:45 PM IST


న్యూజిలాండ్ పర్యటన లో విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన మూటగట్టుకున్నాడు. టీ20, వన్డే, టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన కోహ్లీ పేలవ ప్రదర్శనతో దారుణంగా విఫలమయ్యాడు. అయితే కోహ్లీ ఆట ఫై పలువురు విమర్శలు గుప్పిస్తున్న తరుణం లో మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు. టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ లో విరాట్ తన మార్క్ ప్రదర్శన చూపించలేకపోయారు, అయితే కోహ్లీ ఆట తీరు ఫై వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ప్రతి క్రికెటర్ ఇలాంటి పరిస్థితి ని ఎదుర్కోక తప్పదని కోహ్లీ కి సపోర్ట్ చేసారు. అయితే అప్పట్లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, ఇపుడు స్టీవ్ స్మిత్ లు సైతం ఫామ్ లేక ఇబ్బంది పడ్డవారే అని వ్యాఖ్యానించారు. అయితే తాను కూడా ఈ ఫామ్ లేని సమస్యని ఒకానొక సమయంలో ఎదుర్కొన్నానని తెలిపారు. అంతేకాని నా సహజ సిద్దమైన ఆట తీరు ని వదులుకోలేదని సెహ్వాగ్ వ్యాఖ్యానించారు. అయితే మళ్ళీ ఫామ్ అందుకోవాలంటే కాస్త సహనం కావాలని, కోహ్లీ మళ్ళీ తప్పకుండ జోరు అందుకుంటాడు అని సెహ్వాగ్ అన్నారు.