బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో పీవీ సింధు కి ఘన స్వాగతం

Tuesday, August 27th, 2019, 11:44:00 PM IST

బ్యాడ్మింటన్ ఆటలో భారత బ్యాడ్మింటన్ కళాకారిణి పీవీ సింధు బడఁమింటన్ ఆటలో మరొక ఎత్తుకు ఎదిగిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు గోల్డ్‌మెడల్ సాధించింది. కాగా ఆటలో బంగారు పథకాన్ని సాధించిన పీవీ సింధు కొద్దిసేపటిక్రితం హైదరాబాద్‌ చేరుకున్నారు. కాగా సింధుతో పాటు ఆమె తండ్రి రమణ మరియు కోచ్ పుల్లెల గోపీచంద్ ఉన్నారు. అయితే హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న పీవీ సింధు కి ఇక్కడ ఘన స్వాగతం లభించింది. కాగా ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన సింధు కి తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమానాశ్రయంలోనే ఘన స్వాగతం పలికారు. కాగా హైదరాబాద్ కి చేరుకున్న సింధు కి స్వాగతం పలికేందుకు బ్యాడ్మింటన్‌ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆతరువాత నేరుగా బేగంపేట నుంచి గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీకి వెళ్లారు. ఆతరువాత అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు…

ఈమేరకు మాట్లాడిన పీవీ సింధు… ఎన్నోరోజుల నిరీక్షణ ఫలించింది. ఈ విజయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కాగా నాకు మద్దతిచ్చిన అందరికి న ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను… అంతేకాకుండా అందరి ఆశీర్వాదంతో బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో బంగారు పథకాన్ని సాధించడం చాల ఆనందంగా ఉంది. కాగా ఫైనల్ మ్యాచులో ఎలాంటి ఒత్తిడికి లోనవ్వలేదు. ఆటలో నూటికి నూరుశాతం నా ఆటను ప్రదర్శించాను అని చెప్పుకొచ్చారు.

ఆతరువాత కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ… బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ ను సాదించాలనే నా కలను సింధు సాకారం చేసింది. కాగా ఒకహురా తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచులో విజయం సాదించేందుకు సింధు అన్ని విధాలా సిద్దపడింది. తన అద్భుతమైన ప్రదర్శనతో బంగారు పథకాన్ని సాధించింది. ఇకపోతే త్వరలో రానున్న ఒలంపిక్స్ లో స్వర్ణమే లక్ష్యంగా సింధు సిద్ధమవుతుందని పుల్లెల గోపీచంద్ తెలిపారు.