117 పరుగులకే వెస్టిండీస్ తోక కత్తిరించిన భారత్ బౌలర్లు

Sunday, September 1st, 2019, 11:00:09 PM IST

వెస్టిండీస్ తో జరుగుతున్నా రెండో టెస్ట్ లో టీం ఇండియా మరింత పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌ ఆడిన టీం ఇండియా 416 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ లో కేవలం 117 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయ్యింది. నిన్న రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 87 పరుగులకు 7 వికెట్ల కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న ఆ జట్టు ఈ రోజు ఆటలో మరో 30 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయ్యింది.

ఇండియా పేసర్ బుమ్రా తన పదునైన పేస్ తో వెస్టిండీస్ బ్యాటింగ్ వీరులకు చుక్కలు చూపించాడు. తొలిరోజే ఆరు వికెట్స్ తీసి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. ఇక మిగిలిన పనికి షమీ రెండు వికెట్లు, ఇషాంత్,జడేజా చెరో వికెట్ తీసుకోని పూర్తిచేశారు. దీనితో టీం ఇండియాకి 299 పరుగుల భారీ మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా మొదటిలోనే మయాంక్ వికెట్ కోల్పోయింది.

ఇక మూడో రోజు కాబట్టి ఈ రోజు మొత్తం బ్యాటింగ్ చేసి, రేపు ఒక రెండు సెషన్స్ బ్యాటింగ్ చేసి మరో 200 నుండి 250 పరుగులు స్కోర్ బోర్డు మీద పెట్టేస్తే సరిపోతుంది. అంత భారీ స్కోర్ ని ఛేదించటం వెస్టిండీస్ కి తలకి మించిన భారం అవుతుంది. వాళ్ళని ఆలౌట్ చేయటానికి ప్రస్తుతం టీం ఇండియా బౌలర్లు ఉన్న ఫామ్ ప్రకారం ఐదు సెషన్స్ లో ఆలౌట్ చేయటం పెద్ద విషయమేమి కాదు.