కోహ్లీ అధిగమించలేని ఆ సచిన్ రికార్డు ఏంటి?

Thursday, August 22nd, 2019, 06:03:06 PM IST

ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్న విరాట్ కోహ్లీ సచిన్ రికార్డులను బ్రేక్ చేసే దిశలో వున్నట్లుగా తెలుస్తుంది. 100 సెంచరీల రికార్డు ని కూడా అందుకునే సత్తా ఒక కోహ్లీకి మాత్రమే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం 68 అంతర్జాతీయ సెంచరీలతో సచిన్ రికార్డులను చెరిపేయగలడని ఫాన్స్, విశ్లేషకుల నమ్మకం. కోహ్లీ కెరీర్ ఇంకా చాల ఉన్నందున సచిన్ రెకార్డులన్నిటిని చేరుకోగలడని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.

ఐతే సచిన్ రికార్డులని ఉద్దేశించి మాజీ క్రికెటర్,డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీపై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కోహ్లీ ఆ సచిన్ కి సంబందించిన ఒక రికార్డుని అందుకోవడం ఎవరి వల్ల కాదని అంటున్నాడు. కోహ్లీకి ఛాలెంజ్ చేసినట్లుగా ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. సచిన్ ఆ రెండొందల టెస్ట్ మ్యాచ్ ల రికార్డుని ఎవరు అందుకోలేరని,దరిదాపుల్లోకి కూడా ఎవరు రారు అంటూ కామెంట్ చేసాడు. కోహ్లీ ఇప్పటివరకు 77 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు.వన్డే రికార్డులను కోహ్లీ బ్రేక్ చేయగలడని దానికి ఎంతో సమయం పట్టదంటూకోహ్లీని ప్రశంసించాడు.