అరుదైన ఘనత సాధించనున్న కోహ్లీకి, రోహిత్ అడ్డు పడతాడా?

Sunday, December 15th, 2019, 12:45:05 PM IST

భారత కేప్టెన్ విరాట్ కోహ్లీ ఎవరూ అందుకొని రికార్డుల్ని సైతం తన బ్యాటింగ్ పవర్ తో అందుకుంటున్నాడు. ఎన్నో రికార్డుల్ని అధిగమిస్తూ ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ గా రాణిస్తున్నాడు. అయితే వన్డేల్లో ఎంతో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న విరాట్ కోహ్లీకి ఈ ఏడాది రోహిత్ శర్మ నుండి గట్టి పోటీని ఎదుర్కోనున్నాడు. అదేంటో, దాని విషయాలేంటో మనం ఇక్కడ చూద్దాం.

ఈ ఏడాది వన్డేల్లో విరాట్ కోహ్లీ 1288 పరుగులు చేసి, ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా ముందు వరుసలో వున్నారు. అయితే కేవలం 56 పరుగుల తేడాతో రోహిత్ శర్మ 1232 పరుగులు చేసి రెండవ స్థానంలో వున్నారు. అయితే ఈ ఏడాది కూడా వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిస్తే వరుసగా మూడు సంవత్సరాలున్నా ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా, ఎక్కువసార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రెకార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు 2011, 2017, 2018 సంవత్సరాలలో వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచారు.

అయితే నేటి నుండి వెస్ట్ ఇండీస్ తో మొదలు కానున్న వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ చెలరేగితే ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా రెకార్డులకెక్కే అవకాశం వుంది. వెస్ట్ ఇండీస్ తో జరగనున్న మూడు వన్డే ల సిరీస్ లో ఈరోజు తొలి వన్డే ప్రారంభం కానుంది.