ప్రపంచకప్ 2019 : నిరాశ పరిచిన టీమిండియా ఆటగాళ్లు

Wednesday, July 10th, 2019, 07:47:38 PM IST

ఈసారి కూడా టీమిండియా ఆటగాళ్లతో సహా ప్రతీ భారతీయుడు కన్న కల చెదిరిపోయింది. ఈసారైనా ప్రపంచకప్ సాధించాలనే భారత్ ఆశలన్నీ కూడా గల్లంతయ్యాయి. ప్రపంచకప్ 2019 సీజన్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా నేడు జరిగిన మొదటి సెమి ఫైనల్ మ్యాచులో టీమిండిన ఆటగాళ్లు చాలా నిరాశ పరిచాడు. భారత ఆటగాళ్లు బ్యాటింగ్ కి దిగినప్పటినుండి వరుసగా వికెట్లు కోల్పోవడంతో అందరు నిరాశలో కూరుకుపోయారు. కాగా ఈ మ్యాచులో ధోని, జడేజా చేసిన పోరాటం కూడా వృధా అయిపోయింది. కేవలం 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. ముందుగా ఓపెనర్లు అందరు కూడా వచ్చిన వెంటనే పెవిలియాన్ దారి పట్టారు. కేవలం 5 పరుగులకే మన టీమిండియా ఆటగాళ్లు 3 వికెట్లను కోల్పోయారు. కాగా ఆతరువాత వచ్చిన రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) కాసేపు కుదురుగా ఆడుతున్నారు అని అనుకున్న సమయంలో వీరి వికెట్లు కూడా పడటంతో మళ్ళీ నిరాశతో కూడిన ఎదురు చూపులు తప్పడం లేదు.

కాగా తరువాత క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా కూడా ఒకదశలో బాగానే రాణించినప్పటికీ వీరు మాత్రం కేవలం సింగిల్స్ కె పరిమితం అవ్వడం అనేది మాత్రం చాలా దారుణమని చెప్పాలి. జడేజా చాలా చక్కటి ప్రదర్శన కనబరచగా పరుగులు బాగానే వచ్చినప్పటికీ కూడా చివరకు 77 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఇక వీరిద్దరు అవుట్ అవడంతో మ్యాచ్ చేజారిపోయింది చెప్పాలి. అయితే న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేయగా, ఆ టీమ్‌లో కేన్ విలియమ్‌సన్ 67, రాస్ టేలర్ 74 పరుగులు చేశారు. భువనేశ్వర్ 3 వికెట్లు దక్కించుకోగా, బుమ్రా, పాండ్యా, జడేజా, చాహల్‌ తలో వికెట్ పడగొట్టారు.