టీమిండియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూవీ – కారణం ఏమై ఉంటుంది…?

Wednesday, December 18th, 2019, 10:16:22 AM IST

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, మన టీమిండియా యాజమాన్యంపై తాజాగా కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి టీమిండియా యాజమాన్యం పాటించిన విధానాన్ని యూవి పూర్తిగా తప్పుబడుతున్నారు. అయితే మిడిల్‌ ఆర్డర్‌లో అనుభవం లేని ఆటగాళ్లకు ఆడే అవకాశం ఇవ్వడం వలన పెద్ద తప్పిదం జరిగిందని, దాని వల్లనే మన జట్టు ఓడిపోయిందని అన్నారు. కాగా యువరాజ్ సింగ్ తాజాగా ఒక మీడియా కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడిన యువరాజ్ సింగ్ టీమిండియా ఓటమిపై పలు కీలకమైన అంశాలను వెల్లడించారు. అంతేకాకుండా మిడిలార్డర్ లో సరిగ్గా ఆడే ఆటగాళ్లను ఎంపిక చేయలేదని విమర్శలు చేశారు.

ఇకపోతే ప్రపంచ కప్ కి సంబంధించి టీంఇండియా ఆటగాడు అంబటి రాయుడు విషయంలో యాజమాన్యం చాలా అన్యాయం చేసిందని, అసలు జట్టులో సరైన అనుభవం లేనటువంటి విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్‌ లాంటి ఆటగాళ్లను తీసుకోవాలని ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీమిండియా జట్టు విషయంలో యాజమాన్యం సరైన ప్రణాళికలు తీసుకోవాలని, ఆలా అయితేనే మనం ఇక మీదట నెగ్గగలమని యువరాజ్ సింగ్ వెల్లడించారు.