“అమృతం 2” సీరియల్ పై లేటెస్ట్ ఆఫీసియల్ అప్డేట్.!

Thursday, February 27th, 2020, 12:36:32 PM IST

మన తెలుగు టెలివిజన్ చరిత్రలోనే “అమృతం” సీరియల్ కు ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే.ఇంకో వందేళ్లు గడిచినా సరే తెలుగు వారు చెప్పుకునే సీరియల్స్ లో ఇది కూడా ఒక సీరియల్ గా నిలుస్తుంది.ప్యూర్ అచ్చమైన కామెడీతో సాగే ఈ కల్ట్ క్లాసిక్ సీరియల్ దాదాపు ఏడేళ్ల పాటుగా కొనసాగి బ్రేక్ తీసుకుంది.మళ్ళీ ఇన్నాళ్లకు దీనికి సీక్వెల్ సిద్ధంగా ఉందని గత కొన్ని రోజులు నుంచి తెలిసిన సమాచారమే అయితే ఈ సీరియల్ కు సంబంధించి ఇప్పుడు ఒక అధికారిక అప్డేట్ ను ఈ సీరియల్ ను స్ట్రీమ్ చేయనున్న “జీ 5” వారు తెలుపుతున్నారు.

ఈ సీరియల్ సృష్టి కర్తతో మొదటి సీరియల్ కు అద్భుతమైన పాటకు సాహిత్యాన్ని అందించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అలాగే ఆ పాటకు అంతే స్థాయి ఎంటర్టైనింగ్ సంగీతాన్ని అందించిన కళ్యాణి మాలిక్ గారు కలిసి ఈసారి అంతకు మించిన అద్భుతమైన పాటను అందించేందుకు డీప్ డిష్కసన్ లో ఉన్నారని వారు ముగ్గురు కలిసి ఉన్న ఒక ఫోటోను విడుదల చేసారు.అంటే ప్రస్తుతానికి సాంగ్ సిట్టింగ్ లో ఉన్నారని చెప్పాలి.మొదటి సీజన్ ను బీట్ చెయ్యగలిగే సాంగ్ నే ఈసారి సిద్ధం చేసారో లేదో తెలియాలి అంటే మార్చ్ 25 వరకు ఆగాల్సిందే.