లేటెస్ట్ బజ్ : “సైరా” స్ట్రీమింగ్ పై సరికొత్త డేట్..?

Tuesday, November 19th, 2019, 05:26:08 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని ఆన్లైన్ లో స్ట్రీమ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.అమెజాన్ ప్రైమ్ లో 4K క్వాలిటీలో ఈ చిత్రం అందుబాటులోకి రాబోతుంది అని ఇది వరకే వార్తలొచ్చాయి.అలాగే అసలు ఎప్పటి నుంచి మనం స్ట్రీమ్ చెయ్యొచ్చు అన్న అంశానికి సంబంధించి కూడా అనేక తేదీలు చూసి విని మెగా ఫ్యాన్స్ విసిగిపోయారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో తేదీ వినబడుతుంది.రేపు నవంబర్ 20తో ఈ చిత్రం 50 రోజులు పూర్తవుతుంది. దీనితో మరో 6 రోజులు తర్వాత అంటే సైరా విడుదల అయ్యిన 56 రోజుల తర్వాత ఈ చిత్రం స్ట్రీమ్ కాబోతుంది అని టాక్.ఇలా 56 రోజుల తర్వాత ఒప్పంద ప్రాతిపాదికన నవంబర్ 26న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వస్తుంది అని బజ్ వినిపిస్తుంది.మరి ఇదైనా సరే నిజమవుతుందో లేదో చూడాలి.