“సాహో” విషయంలో ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్.!?

Friday, October 18th, 2019, 05:32:42 PM IST

ఈ ఏడాది ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన చిత్రాల్లో “సాహో” కూడా ఒకటి.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టిన డిజాస్టర్ గా మిగిలిపోయింది.అయితే ఇపుడు ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీదకు రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని ఎక్స్ క్లూజివ్ గా ఈ రోజు అర్ధ రాత్రి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేసుకోవచ్చని అమెజాన్ వారు అధికారికంగా తెలియజేసారు.

దీనితో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎక్కువగానే ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అలా ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ కూడా ఉండాబోతున్నట్టు తెలుస్తుంది.ఇపుడు ప్రసారం కాబోయే సినిమాలో థియేటర్ లో వెయ్యని సీన్స్ అదే..డిలీటెడ్ సీన్స్ కూడా ఉండబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇదే కానీ నిజమైతే అభిమానులకు మాత్రం నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.మరి నిజంగానే ఈ డిలీటెడ్ సీన్స్ కూడా ఉన్నాయో లేదో చూడాలి.