టెలికాస్ట్ చేసే ఛానెల్ తోనే “అల వైకుంఠపురములో”

Tuesday, January 14th, 2020, 07:40:23 AM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన “అల వైకుంఠపురములో” చిత్రం సాధించిన అఖండ విజయంతో అభిమానులు సహా వారై టీం అంతా అసలైన సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఈ చిత్రాన్ని ఎప్పటి నుంచో ఎటువంటి స్ట్రీమింగ్ యాప్స్ లో అందుబాటులోకి ఉండదని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ ఫ్లిక్స్ ల ఫోటోలు పెట్టి వాటిలో అందుబాటులో ఉండదని చెప్పేసారు.

అయితే ఈ చిత్రాన్ని ఎక్స్ క్లూజివ్ గా టెలికాస్ట్ చెయ్యబోయే జెమినీ ఛానల్ వారు ఈ “అల వైకుంఠపురములో” టీం తో ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసారు.ఈ ఇంటర్వ్యూ ను ఈ రోజు బోగి కానుకగా ఉదయం 8 గంటలకు టెలికాస్ట్ చెయ్యబోతున్నారు.మరి ఈ ఇంటర్వ్యూ లో ఎవరెవరు వచ్చి ఎలాంటి విషయాలు పంచుకున్నారో తెలియాలి అంటే ఈ ఇంటర్వ్యూ ను మిస్సవ్వకుండా చూడండి.ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది.