“అల వైకుంఠపురములో” అక్కడ కూడా టెలికాస్ట్ కానుందా.?

Sunday, June 28th, 2020, 03:52:22 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టబు, జైరాం సుశాంత్ మరియు నివేత పేతురాజ్ లాంటి అగ్ర తారాగణంతో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం డిజిటల్ గా కూడా దుమ్ము రేపింది. అయితే ఈ చిత్రం మన తెలుగు బుల్లితెర మీద టెలికాస్ట్ కు వచ్చే ఆగిపోయింది. కానీ ఇప్పటికే మలయాళంలో టెలికాస్ట్ అయ్యి డబ్బింగ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డు టీఆర్పీ నెలకొల్పింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం తమిళ్ లో కూడా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానున్నట్టు సమాచారం.

సన్ టీవీ ఛానెల్లో ఈ చిత్రం అతి త్వరలో టెలికాస్ట్ అవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మన దగ్గర కూడా అదే నెట్వర్క్ కు చెందిన జెమినీ ఛానెళ్ళోనే టెలికాస్ట్ కానుంది. అలా ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఒకేసరి టెలికాస్ట్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.