“అల వైకుంఠపురములో” ఆగిందా?కారణం ఇదేనా?

Tuesday, February 25th, 2020, 03:12:04 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందని గత కొన్ని రోజుల నుంచీ సోషల్ మీడియాలో అధికారిక వార్తలే హల్ చల్ చేసాయి.

కానీ అనూహ్యంగా ఇంకా సినిమా రెండు రోజుల్లో అందుబాటులోకి వచ్చేస్తుంది అనగా ఈ చిత్రం తాలుకా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న సన్ నెక్స్ట్ వారు నిన్ననే మళ్ళీ కమింగ్ సూన్ అంటూ పోస్ట్ పెట్టి షాకిచ్చారు.అంటే ఈ లెక్కన ఈ చిత్రం స్ట్రీమింగ్ రేపు లేనట్టే అని కన్ఫర్మ్ అయ్యిపోయింది.అయితే దీనికి గల కారణాలు కూడా తెలుస్తున్నాయి.

నిజానికి ఈ చిత్రం ఇంకా థియేటర్స్ లో అదరగొడుతుంది ఇలాంటి సమయంలో అప్పుడే స్ట్రీమింగ్ కు తీసుకురావద్దని అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది.అలాగే మరికొందరు అయితే సినిమా 50 రోజులు కూడా పూర్తి కాకుండా ఎలా విడుదల చేస్తారని కాస్త గట్టిగానే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.దీనితో ప్రస్తుతానికి స్ట్రీమింగ్ వెర్షన్ లో “అల వైకుంఠపురములో” ఆగిపోయిందని తెలుస్తుంది.అలాగే ప్రస్తుతానికి కూడా సన్ నెక్స్ట్ వారు రేపే విడుదల చేస్తున్నామని ఇంకా ఏ ప్రకటన కూడా ఇవ్వలేదు.