పునర్నవికి పెళ్ళైతే తన భర్తతో మాట్లాడదా..?

Tuesday, November 19th, 2019, 01:17:20 PM IST

తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న పునర్నవి ఈ రియాలిటీ షో ద్వారా ఎంతటి పేరు తెచ్చుకుందో మనం చూసాం.అలాగే రాహుల్ తో ఏర్పడ్డ పరిచయం తర్వాత ఇద్దరి మధ్య కెమిస్ట్రీ దెబ్బకు ఈ జంట కంటూ సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు.దీనితో ఈ ఇద్దరనే కలిపే ఏవన్నా షోలకు ఇంటర్వ్యూస్ కోసం పిలుస్తున్నారు.బిగ్ బాస్ టైటిల్ విన్నయ్యాక రాహుల్ మరియు పునర్నవీలు ఈటీవీలో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాంకు ఈ వారం ముఖ్య అతిధులుగా వచ్చారు.

అయితే ఈ ప్రోగ్రాం మొదట్లోనే ఆలీ పునర్నవికి దిమ్మ తిరిగే ప్రశ్న వేశారు.పునర్నవి తాను ఏదైనా కొత్త ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడి మనుషులతో కలవడానికి చాలా టైం తీసుకుంటానని అలాగే రాహుల్ విషయంలో కూడా జరిగిందని చెప్పింది.దీనికి ఆలీ అయితే మీ నాన్న నీకో పెళ్లి సంబంధం చూసి లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేస్తే అప్పుడు నీ భర్తతో కూడా మాట్లాడవా అని అడిగారు.దీనికి పున్ను కాసేపు స్టక్ అయ్యి అంత తర్వగా అయితే మాట్లాడను కానీ మినిమమ్ ఒక వారం అయినా తన భర్తతో మాట్లాడ్డానికి సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చింది.