బిగ్ బాస్ 3: బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు పూయించిన అలీ, రాహుల్

Wednesday, October 16th, 2019, 09:30:51 AM IST

బిగ్ బాస్ హౌస్ లో కామెడీ అద్దిరిపోయిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ హోటల్ కి పనిచేస్తున్న స్టాఫ్ ల కుటుంబ సభ్యులు మారారు. అలీ, శివ జ్యోతి, రాహుల్ క్లీనింగ్ స్టాఫ్ గా ఉండగా, బాబా మాస్టర్, వితిక, శ్రీముఖి కుకింగ్ స్టాఫ్, వరుణ్ సందేశ్ హోటల్ కి మేనేజర్ ల మారిపోయాడు. బిగ్ బాస్ ఇస్తున్న డిఫరెంట్ టాస్కుల్లో అందరు పెర్ఫార్మన్స్ అదరగొడుతున్నారు. డ్రిల్ల్ జరిగే సమయం లో వితిక చెల్లి రాకతో కన్నీరు పెట్టుకుంది వితిక, అందని పలకరించి హోటల్ కి వన్ స్టార్ ఇచ్చి వెళ్ళిపోయింది.

అందరు ఆనందంగా ఆడుతూ వున్నారు, ఇంతలో క్లీనింగ్ టాస్క్ ఇవ్వగానే అందరు క్లీన్ చేస్తున్నారు, అలీ మాత్రం రాహుల్ ని క్లీన్ చేస్తూ పొట్ట చెక్కలయ్యేలా ప్రేక్షకుల్ని నవ్వించాడు. క్లీన్ అని చెప్పారు, ఏమి క్లీన్ చెయ్యాలో చెప్పలేదు అని రాహుల్ ని అలానే క్లీన్ చేస్తాడు అలీ. బిగ్ బాస్ హౌస్ లో కొద్దిసేపు నవ్వులు పూయించిన అలీ, ఆ తరువాతి స్లీప్ మోడ్ లో అలీ వైఫ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రాహుల్-అలీ స్నేహం తో హౌస్ లో నవ్వులు పూయించారు.