ఆ చిత్రం వారిదే అంటున్న సరిలేరు నీకెవ్వరూ దర్శకుడు

Tuesday, January 14th, 2020, 01:20:08 AM IST

అలీతో సరదాగా కార్యక్రమినికి విచ్చేసిన అనిల్ రావిపూడి, రాజేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నారు. పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులు బోర్ కొడితే రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తా అంటూ తన పుస్తకంలో రాసుకున్న విషయాన్నీ అలీ సభాముఖంగా తెలియజేసారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గత సినిమాల్లో తన అనుభవాల్ని కొన్ని అలీ తో సరదాగా కార్యక్రమంలో తెలియజేసారు. తాను నటించిన చిత్రాలలోని పలు డైలాగుల్ని చెప్పి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసారు.

అయితే సరిలేరు నీకెవ్వరూ చిత్రం తో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ కార్యక్రమంలో విజయశాంతి ని ఎలా ఒప్పించారో తెలియజేసారు. అయితే f2 చిత్రం తో సరికొత్త గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ఆ చిత్రానికి ఇన్స్పిరేషన్, రియల్ లైఫ్ లో మగాళ్లే అంటూ, ఆ చిత్రం వారిదే అంటూ ఆసక్తికర విషయాల్ని తెలిపాడు. సరిలేరు నీకెవ్వరూ చిత్రం విజయోత్సహంలో వున్న దర్శకుడు మరిన్ని విషయాల్ని ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే జనవరి 20 న మీ ఈటీవీ లో రానున్న అలీతో సరదాగా కార్యక్రమాన్ని చూడాల్సిందే.