అలీ షోలో బాలయ్యకే వార్నింగ్ ఇచ్చిన లైలా..దబిడి దిబిడే

Friday, September 20th, 2019, 02:20:18 PM IST

ప్రతి వారం వారం సినీ సెలబ్రటీస్ తో షో చేస్తూ పాతతరం నటి నటులను మన ముందుకి తీసుకోని వస్తూ వాళ్ళ అంతరంగాలను మన ముందు ఆవిష్కరిస్తున్న అద్భుతమైన షో అలీతో సరదాగా. గతవారం చలపతి రావు గారి రియల్ లైఫ్ గురించి మనందరికీ తెలిసేలా చేసి, ఆయన గొప్ప వ్యక్తత్వాన్ని మన ముందు ఆవిష్కరించాడు. తాజాగా ఈ వచ్చే వారం ఈ షోకి ఒకప్పటి హీరోయిన్ లైలా వచ్చింది. ఆ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు.

ఇందులో లైలా ఫుల్ ఎనర్జీ తో కనిపిస్తుంది. షో మొత్తం తనదైన నవ్వులతో షోకి సరికొత్త ఊపు తీసుకోని వచ్చింది. నీది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా అని అడగటంతో “లవ్ మ్యారేజ్” అంటూ చాలా చిలిపిగా సమాధానం ఇస్తున్నది. బాలయ్య బాబుతో సినిమా చేస్తుంటే నీకు ఎలా అనిపించిందని అడగటంతో “ఈ రోజే బాలయ్య గారిని కలిశాను. ఐరన్ మ్యాన్ అంటూ చెప్పింది. దీనితో అలీ రియల్ ఐరన్ మ్యాన్ బాలయ్య అనేసరికి..అవును అవును బాలయ్య నిజంగా ఐరన్ మ్యాన్ అంటూ చెపుతుంది .

ఆ తర్వాత నీ పర్స్ లో మూడు ఐటమ్స్ ఉంటాయి కదా అంటూ అలీ అడిగేసరికి, అవును ఒకటి కీ, రెండు లిప్ స్టిక్, మూడు అలీగారి ఫోటో అని చెప్పటంతో అలీ షాక్ అవుతాడు. ఏది నీ పర్స్ ఎక్కడ ఉంది. చూపించమని సరదాగా అడగటంతో ఒక్కసారిగా పెద్దగా నవ్వుతుంది. బాలయ్య బాబు ఇక్కడ ఉంటే ఆయనకి ఎలా వార్నింగ్ ఇస్తావు అంటూ అలీ అడగటంతో లైలా పైకి లేచి తొడకొట్టి మరి ‘నాతో సినిమా చేయాలి లేకపోతే చంపేస్తా’ అంటూ వార్నింగ్ ఇస్తుంది లైలా..షో మొత్తం అలీతో లైలా చేసిన సందడి మాములుగా లేదు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి