నన్ను హింసపెట్టారు..ఆత్మహత్య చేసుకోబోయాను..అలీతో చలపతి

Friday, September 13th, 2019, 03:40:33 PM IST

ఈటీవీ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకి సినీ సెలెబ్రిటీస్ వచ్చి తమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ వాటిని ప్రేక్షకులతో పంచుకుంటారు. ప్రతి వారం వారం ఒక్కో సెలెబ్రటీ వచ్చి అలీతో సరదాగా గడిపిపోతారు, తాజాగా వచ్చేవారం ఎపిసోడ్ కి ప్రముఖ సీనియర్ నటులు చలపతి రావు వచ్చారు. చలపతిరావుకి అలీకి దాదాపు ముప్బై ఏళ్ళ అనుబంధం ఉంది, ఈ షో లో ఇద్దరు కూడా అదిరిపోయే స్థాయిలో ఎంటర్టైన్ మెంట్ ఇచ్చారు.

ఈ క్రమంలో చలపతి రావు కొన్ని విషయాలు షేరు చేసుకున్నారు. అలీ మాట్లాడుతూ ఎప్పుడు దైర్యంగా, మొండిగా వుండే మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు అని అడగటంతో, చలపతిరావు ఆవేదనగా మాట్లాడుతూ నేను ఒక ఫంక్షన్ లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడనంటూ మీడియాలో నా గురించి దారుణంగా మాట్లాడటం జరిగింది. ఎంత దారుణంగా అంతే ఇక చనిపోవటమే మేలు అనుకునే విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు..

నాకు ఆడవాళ్లు అంతే చాలా గౌరవం. 22 ఏళ్ల వవస్సులో నా భార్య చనిపోతే నేను మరోపెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నాను. అలాంటిది నేను ఆడవాళ్లను ఎదో అన్నానని నా గురించి ఛండాలంగా మాట్లాడేవాళ్ళు, దీనితో ఒక లెటర్ రాసిపెట్టి అమ్మ మీ అందరికి చాలా థాంక్స్ అని రాసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానంటూ చలపతి రావు ఇందులో చెప్పుకొచ్చాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి