నెక్స్ట్ వీక్ “ఎక్స్ట్రా జబర్దస్త్”…ఆల్ విన్నర్స్.!

Saturday, June 8th, 2019, 08:57:39 PM IST

వచ్చే వారం ఈటీవీ ఛానెల్లో టెలికాస్ట్ కాబోయే “ఎక్స్ట్రా జబర్దస్త్” షో తాలూకా ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.ఈ ప్రోమోను చూసినట్లయితే వచ్చే వారం ఎక్స్ట్రా ఫన్ తో కడుపుబ్బా నవ్వులు తప్పవని చెప్పాలి.ప్రతీ ఒక్క టీమ్ కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసినట్టు ఈ ప్రోమోను చూస్తేనే అర్ధం అవుతుంది.ఇచ్చిన పాత్రలో జీవించేసే సీరియస్ నటుడిగా గెటప్ శీను ఓవర్ యాక్షన్ చేసే నటుడిగా సుధీర్ ల మధ్య పండిన ఫన్ అయితే మాములుగా లేదు.అలాగే రాకేష్ టీమ్ లో ఉండే దీవెన రష్మీ పై వేసిన పంచులు కూడా చాలా హిలేరియస్ గా పండాయి.

అలాగే దీవెనకు మరియు “పటాస్ 2″లో సెన్సేషన్ గా మారుతున్న రిత్విక పై అసూయ పడుతున్నట్టుగా చేసిన స్కిట్ కూడా అద్భుతంగా పండింది.అలాగే చమ్మక్ చంద్ర కూడా ఈసారి మళ్ళీ సత్తిపండును బుక్ చేసేసారు.ఇలా ప్రతీ ఒక్కరు కూడా అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునే సరికి వచ్చే వారం ప్రతీ ఒక్కరూ విజేతలుగా నిలిచారు.రష్మీ వ్యాఖ్యాతగా నిర్వహించే ఈ షో కు నాగబాబు మరియు రోజాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.మరి ఈ ఎపిసోడ్ ఎంత వినోద భరితంగా ఉందో తెలియాలంటే వచ్చే జూన్ 14 శుక్రవారం రాత్రి 9:30 నిమిషాలకు మీ ఈటీవీలో చూడాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి