స్మాల్ స్క్రీన్ యూట్యూబ్ చరిత్రలోనే ఇదొక ఆల్ టైం రికార్డ్.!

Sunday, December 15th, 2019, 03:51:33 PM IST

ఇప్పుడు మాట్లాడబోయే విషయాన్ని స్మాల్ స్క్రీన్ యూట్యూబ్ రికార్డు అనాలా లేక యూట్యూబ్ స్మాల్ స్క్రీన్ రికార్డు అనాలా అర్ధం కానీ పరిస్థితి అని చెప్పొచ్చు.తెలుగులో ఉన్నటువంటి అనేక ఛానెల్స్ టాప్ 3 లో ఈటీవీ కూడా ఒకటి.ఇతర ఛానెల్స్ లా ఎలాంటి కొత్త సినిమాలు కానీ టాప్ మోస్ట్ హీరోల సినిమాలు టెలికాస్ట్ చెయ్యకుండానే అదిరిపోయే కంటెంట్ తో వన్ అఫ్ ది టాప్ మోస్ట్ ఛానెల్ గా ఈటీవీ పరుగులు తీస్తుంది.

ముఖ్యంగా అయితే ఈ ఛానెల్లో ప్రసారం అయ్యే షోలు కానీ ఈవెంట్లను కానీ ఏ ఇతర ఛానెల్స్ కూడా కొట్టలేకపోతున్నాయి అని చెప్పాలి.టెలివిజన్ తెరపై ఏ స్థాయిలో అయితే ఈటీవీ మరియు మల్లెమాల కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తారో అంతే స్థాయిలో వీరి కంటెంట్ ను యూట్యూబ్ లో కూడా ఆదరిస్తారు.అతి తక్కువ సమయంలోనే వీరి జబర్దస్త్ మరియు ఎక్ట్రా జబర్దస్త్ ప్రోమోలకు మిలియన్ వ్యూస్ ఇట్టే వచ్చి పడతాయి.కానీ ఇటీవలే పెట్టిన జబర్దస్త్ ప్రోమోకు ఊహించని విధమైన రెస్పాన్స్ వచ్చింది.

వచ్చే వారం టెలికాస్ట్ చేసే ప్రోమోను ఇటీవలే విడుదల చెయ్యగా కేవలం 6 గంటల్లోనే 1.1 మిలియన్ వ్యూస్ అందుకుంది.ఇది నిజంగా స్మాల్ స్క్రీన్ యూట్యూబ్ చరిత్రలోనే ఒక ఆల్ టైం రికార్డ్.కొంతమంది టైర్ 2 హీరోల టీజర్లు ట్రైలర్లకే ఈస్థాయి వ్యూస్ వస్తాయి.కానీ ఒక టెలివిజన్ షోకు ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ఇదే మొదటి సారి అని చెప్పాలి.దీనిని బట్టి “జబర్దస్త్” ప్రోగ్రాం అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎంత గొప్ప స్థానం ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి