అఫీసియల్ అప్డేట్ వచ్చేసింది “సైరా” స్ట్రీమింగ్ అప్పటి నుంచే.!

Tuesday, November 19th, 2019, 06:58:29 PM IST

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు రీసెంట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని ఇప్పుడు డిజిటల్ గా చూసేందుకు సంసిద్ధం అవుతూ చాలా కాలం నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అలాగే గత కొంత కాలం నుంచి వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు నిన్నటి నుంచి ఈ చిత్రం కోసం చిన్నగా అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు.

దీనితో మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం రేకెత్తింది.అయితే ఇప్పుడు మళ్ళీ ఓ ట్వీట్ చేసారు.ఇందులో ప్రైమ్ వీడియోస్ వారు అయితే ఎలాంటి తేదీ ఇవ్వలేదు కానీ ఇదే అమెజాన్ కు చెందిన “అమెజాన్ హెల్ప్” వారు అధికారికంగా డేట్ ప్రకటించేసారు.తెలుగు,తమిళ్,మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే నవంబర్ 21 నుంచి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమ్ కానుందని తేల్చి చెప్పేసారు.మొత్తానికి సైరా స్ట్రీమింగ్ సస్పెన్స్ వీడిందని చెప్పాలి.