మళ్ళీ తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న యాంకర్ లాస్య..!

Friday, June 14th, 2019, 09:04:24 PM IST

ప్రస్తుతం తెలుగు రియాలిటీ షోలో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతుంది బిగ్‌బాస్ షో. తక్కువ కాలంలోనే అనూహ్యమైన రేటింగ్‌ను సంపాదించుకోవడంతో ఒక్కసారిగా ఈ ప్రోగ్రాంకు క్రేజ్ పెరిగిపోయింది. అయితే బిగ్‌బాస్ సీజన్ 1 కు జూనియర్ ఎన్‌టీఆర్ హోస్టుగా చేసి తన యాక్టింగ్, యాంకరింగ్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. అయితే బిగ్‌బాస్ తెలుగు ప్రజలకు కొత్తే అయినా జూనియర్ ఎన్‌టీఆర్ హోస్టింగ్ వలన మంచి పేరు సంపాదించుకుంది. అయితే బిగ్‌బాస్ సీజన్ 2 కు నాని హోస్ట్‌గా చేసి పర్వాలేదనిపించాడు.

అయితే ప్రస్తుతం మూడో సీజన్‌లోకి అడుగుపెడుతుంది బిగ్ బాస్ షో. అయితే ఈ సారి హొస్ట్‌గా హీరో నాగార్జున రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా రేణూ దేశాయ్, సావిత్రి, ఉద‌య భాను , కేఏ పాల్ వంటి సెల‌బ్రిటీలు రాబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా వీరితో పాటు ప్రముఖ యాంకర్ లాస్య కూడా రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు దాదాపు లాస్య బిగ్ బాస్‌లో ఎంట్రీకి ఒకే చెప్పారని షో నిర్వాహకుల నుంచి కూడా కాస్తింత సమాచారం భయటపడిందట. అయితే ప్రముఖ టీవీ షోలో యాంకర్‌గా చేసిన లాస్య పెళ్ళైన తర్వాత దాదాపు యాంకరింగ్ చేయడం మానేసింది. అయితే చాలా రోజుల తరువాత తిరిగి మళ్ళీ టీవీలో కనిపించబోతుంది. అయితే ఈ సారి బిగ్ బాస్ షో మాత్రం కలర్‌పుల్‌గా ఉండబోతుందని త్వరగా కంటెస్టెంట్లను ప్రకటించాలని ప్రేక్షకులు కోరుతున్నారట.