బిగ్ బాస్ సీజన్ 3 లో ఈ ప్రముఖ యాంకర్ కూడానా?

Friday, June 7th, 2019, 04:52:24 PM IST

ఇప్పుడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రస్తుతం వరల్డ్ కప్ చూడడంలో బిజీగా ఉంటూనే బిగ్ బాస్ మూడవ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంత గానో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సీజన్ వచ్చే జులై లో మొదలు కాబోతుంది అని ఆ మధ్య వార్తలొచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అని అనిపిస్తుంది.ఇదిలా ఉండగా ఈ షోకు హోస్ట్ గా కూడా కింగ్ నాగార్జున ఖరారు అయ్యిపోయారని మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అలాగే ఈ రియాలిటీ గేమ్ షోలో పాల్గొనే పోటీదారుల విషయంలో కూడా రోజుకొక కొత్త పేరు బయటకు వస్తుంది.అందులో భాగంగానే ఇప్పుడు ఈ షోలో ఒక ప్రముఖ యాంకర్ కూడా కనపడనున్నారని వార్తలు వస్తున్నాయి.ఆమె మరెవరో కాదు v6 ఛానెల్లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తల్లో కనిపించే సావిత్రి కూడా కనిపించనున్నారని ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం.ఇప్పటికే ఈ షోలో శ్రీముఖి,వైవా హర్ష,ప్రముఖ సినీ నటుడు జాకీ,రఘు మాస్టర్ ఇలా చాలా మంది ప్రముఖులే కనిపించనున్నారు.మరి ఈసారి షో ఎలా ఉండబోతుందో చూడాలి.