బాబా భాస్కర్ చేస్తుంది ముమ్మాటికీ తప్పు.. ఇకనైనా మారకపోతే ఎలిమినేట్ ఖాయం

Thursday, August 22nd, 2019, 07:39:21 PM IST

బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ అని చెప్పగానే అందరికి సరదాగా చలాకీగా కనిపించే మనిషి గుర్తుకువస్తారు. మొదటి నుండి హౌస్ లో బాబా అలాగే ఉన్నాడు, అయితే అదే పద్దతి ప్రతి సారి పనికిరాదు. ఒక సమస్య వచ్చిందంటే మెల్లగా దాని నుండి జారుకోవటం, ఎవరైనా ఇద్దరు వ్యక్తల మధ్య వాదన జరుగుతుందే చూడటం తప్ప వెళ్లి ఆపటం, పెద్ద మనిషిగా సలహాలు ఇవ్వటం లాంటివి బాబా ఎప్పుడు కూడా చేయడు.ఇదే విషయం నాగార్జున అడిగితే ‘సర్ నాకు తెలుగు సరిగ్గా రాదు. వాళ్ళు వాళ్ళు ఎదో మాట్లాడుకుంటారు నేను మధ్యలో వెళితే అది ఇంకోలా అర్ధం అవుతుందని’ చెప్పాడు.

సరే పక్క వాళ్ళ విషయం కదా అతని చెప్పింది రైట్ అని అనుకోవచ్చు, కానీ అతని విషయంలోనే అలీ -మహేష్ ఇద్దరు కూడా రెండు రోజుల నుండి గొడవలు పడుతూనే ఉన్నారు. ఇవన్నీ బాబాకి తెలిసే జరుగుతున్నాయి, బాబానే వాటికీ కారణం. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఎందుకు రా గొడవలు పడుతారు, ఇక ఆపేయండి అంటూ పెద్ద మనిషి తరహాలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అసలు బాబా అలీతో గొడవపడటమే ఒక అర్ధం లేని విషయం. రాహుల్ కి ‘ది బెస్ట్’ అనుకునే వరుణ్ ,పునర్నవి ఇద్దరు కూడా రాహుల్ ని నామినేట్ చేశారు. వాళ్లతో పాటుగా మరో ఆరుగురు రాహుల్ ని నామినేట్ చేసిన కానీ సైలెంట్ గా ఉన్నాడు.

ఒక్క అలీ చేస్తేనే బాబా భాస్కర్ గింజుకొని రచ్చ రచ్చ చేశాడు. దీనిలో మహేష్ ఇన్వాల్ అవ్వటం జరిగింది. అలీ మహేష్ ఇద్దరు కూడా కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ఇంత జరిగిన కానీ బాబా భాస్కర్ మాత్రం అది నాకు సంబంధం లేదన్నట్లే ఉంటున్నాడు . ఇలాంటి ధోరణి బిగ్ బోస్ హౌస్ లో కరెక్ట్ కాదు. మంచి తనం ఉండవచ్చు తప్పులేదు కానీ, పక్కన ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఎదో ఒక స్టాండ్ తీసుకోని దానిని ఆపే ప్రయత్నం చేయాలి కానీ ఇలా గోడమీద పిల్ల మాదిరి అటు ఇటు చూస్తూ కూర్చోటం మంచిది కాదు