మాటలతో శివజ్యోతికి నరకం చూపించిన బాబా భాస్కర్

Wednesday, September 18th, 2019, 03:21:30 PM IST

బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ ఎవరికీ సరిగ్గా అర్ధం ఒక పజిల్.. తాను అనుకునేది ఒకటి బయటకి చెప్పేది మరొకటి, ఆయన చేసేది ఇంకొకటి, ఎవరైనా అర్ధం చేసుకోవాలని చూస్తే వాళ్ళని తికమక పెడుతాడు. అతన్ని చూస్తుంటే చాలా వరకు హౌస్ లో ఒక మాస్క్ వేసుకొని తిరిగే మనిషి లాగా కనిపిస్తాడు. కొన్ని విషయంలో నాకేమి తెలియదు అన్నట్లు స్కిప్ అవుతాడు బాబా భాస్కర్. కొందరిని తాను ఏమి అనాలి అనుకున్నాడో అన్ని మాటలు అనేసి, ఆ తర్వాత నేను చెప్పాలి అనుకుంది అది కాదు..నిన్ను అలా అనలేదు..నాకు చెప్పటం సరిగ్గా రాదు అందుకే ఇంకో రకంగా మీకు అర్ధం అయ్యాయని కవర్ చేస్తుంటాడు.

అయితే తాజాగా బాబా భాస్కర్ లోని అసలు కోణం బయటకు వచ్చింది. టాస్క్ లో భాగంగా లెక్చరర్ ఉన్న బాబా భాస్కర్ శివజ్యోతితో మాట్లాడుతూ నువ్వు హౌస్ లో ఎందుకు ఒకరి తర్వాతి ఒకరితో ఎందుకు రిలేషన్స్ పెట్టుకుంటావు. వాళ్ళు హౌస్ నుండి వెళ్ళిపోతే భయంకరంగా ఏడుస్తావు. మొదటిలో అలీ వెళ్ళినప్పుడు అలాగే ఏడ్చావు. ఇప్పుడు ఇంకొకరితో రిలేషన్ షిప్ చేస్తున్నావు. ఆ సమయంలో నిన్ను చూస్తుంటే మాకే ఏదోలా అనిపిస్తుందని అన్నాడు . దీనితో శివజ్యోతి తాను చెప్పాలి అనుకున్న వివరణ చెప్పింది కానీ, బాబా భాస్కర్ మాట్లాడిన మాటలకి ఆమె బాగా హార్డ్ అయ్యింది.