బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ జాబితాలోకి బండ్ల గణేశ్.. కానీ అదే పెద్ద చిక్కు..!

Tuesday, June 11th, 2019, 03:21:36 PM IST

ప్రస్తుతం బిగ్‌బాస్ షో అంటే తెలియని తెలుగు వారుండరు. ఎందుకంటే తక్కువ కాలంలోనే అనూహ్యమైన రేటింగ్‌ను సంపాదించుకోవడంతో ఒక్కసారిగా ఈ ప్రోగ్రాంకు క్రేజ్ పెరిగిపోయింది. అయితే బిగ్‌బాస్ సీజన్ 1 కు జూనియర్ ఎన్‌టీఆర్ హోస్టుగా చేసి తన యాక్టింగ్, యాంకరింగ్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. అయితే బిగ్‌బాస్ తెలుగు ప్రజలకు కొత్తే అయినా జూనియర్ ఎన్‌టీఆర్ హోస్టింగ్ వలన మంచి పేరు సంపాదించుకుంది. అయితే బిగ్‌బాస్ సీజన్ 2 కు నాని హోస్ట్‌గా చేసి పర్వాలేదనిపించాడు.

అయితే ప్రస్తుతం మూడో సీజన్‌లోకి అడుగుపెడుతుంది బిగ్ బాస్ షో. అయితే ఈ సారి హొస్ట్‌గా హీరో నాగార్జున రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సారి బిగ్ బాస్ షోలో సామాన్యుల కన్నా ప్రముఖులే ఎక్కువగా కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి కంటెస్టెంట్లుగా కేఏ పాల్ మరియు రేణు దేశాయ్ రాబోతున్నారని ఇలా పలురకాల పేర్లు ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు బిగ్ బాస్ 3 నిర్వాహకుల నుండి కంటెస్టెంట్‌గా చేయాలంటూ పిలుపు వచ్చిందట. అయితే బండ్ల గణేశ్ కూడా అందుకు ఒప్పుకున్నాడు కానీ వారికి కొన్ని షరతులను పెట్టాడట. అదేమిటంటే రోజుకొకసారైనా తమ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేలా అవకాశం కల్పించాలని కోరాడట. ఇదే తరహాలో రేణు దేశాయ్ కూడా అడగడంతో ఈ ఒప్పందానికి బిగ్‌బాస్ నిర్వాహక వర్గం సుముఖంగా లేనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే మరొకొన్ని పేర్లను పరిశీలించాలని అందులోనే భాగంగా హీరో తొట్టెంపూడి వేణు, హీరో వరుణ్ సందేశ్ వంటి వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. అయితే చివరి వరకు అసలు ఈ సీజన్‌లో ఎవరు కంటెస్టెంట్‌లుగా రాబోతున్నారనేదే అభిమానులకు అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది.