సుమక్కను ఆంటీ అనేసారు..!

Wednesday, June 12th, 2019, 11:09:13 PM IST

తెలుగు యాంకర్లలో దిగ్గజం ఎవరు అంటే ఎవ్వరైనా సరే “సుమ” పేరునే చెప్తారు.ఆమె వ్యాఖ్యాతగా ఎన్నో వందల షోలు సినిమాలకు వ్యహరించారు అది ఎన్నేళ్లు అయినా సరే సుమ అక్కగానే అందరు అంటారు.కానీ ఆమెను మొట్టమొదటిసారిగా ఆంటీ అని కొంతమంది పిల్లలు ఆట పట్టించారు.ఆమె యాంకర్ గా చేసిన షోలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ వచ్చిన షోలలో “భలే చాన్సులే” కూడా ఒకటి.స్టార్ మా ఛానెల్లో ప్రసారమయ్యే ఈ షో ఎన్నో ఏళ్ల క్రితమే ప్రారంభం అయ్యింది.తాజాగా మళ్ళీ మొదలైన ఈ షోకు కొంతమంది చిచ్చర పిడుగులు వచ్చారు.వారు సుమతో పండించిన హాస్యం అంతా ఇంతా కాదు.అలా ఆ మధ్యలోనే సుమను అక్క అని పిలిచేయగా ఆమె రియాక్షన్ చూడాలి మరింత నవ్వు తెప్పిస్తుంది.వీరు ఇంకా ఎంత అల్లరి చేసారో తెలియాలంటే రేపు జూన్ 13న ఉదయం 11:30 నిమిషాలకు ప్రసారం కాబోయే “భలే చాన్సులే” మీ “స్టార్ మా”లో తప్పక చూడాల్సిందే.