బిగ్ బాస్ 3 హోస్ట్ ఫిక్స్.. ఎవరు రాబోతున్నారో తెలుసా..!

Thursday, June 6th, 2019, 12:51:59 PM IST

ప్రస్తుతం బిగ్‌బాస్ షో అంటే తెలియని తెలుగు వారుండరు. ఎందుకంటే తక్కువ కాలంలోనే అనూహ్యమైన రేటింగ్‌ను సంపాదించుకోవడంతో ఒక్కసారిగా ఈ ప్రోగ్రాంకు క్రేజ్ పెరిగిపోయింది. అయితే బిగ్‌బాస్ సీజన్ 1 కు జూనియర్ ఎన్‌టీఆర్ హోస్టుగా చేసి తన యాక్టింగ్, యాంకరింగ్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. అయితే బిగ్‌బాస్ తెలుగు ప్రజలకు కొత్తే అయినా జూనియర్ ఎన్‌టీఆర్ హోస్టింగ్ వలన మంచి పేరు సంపాదించుకుంది. అయితే బిగ్‌బాస్ సీజన్ 2 కు నాని హోస్ట్‌గా చేసి పర్వాలేదనిపించాడు.

అయితే ప్రస్తుతం మూడో సీజన్‌లోకి అడుగుపెడుతుంది బిగ్ బాస్ షో. అయితే ఈ సారి హొస్ట్‌గా రెండు మూడు పేర్లు వినపడుతున్నా ఫైనల్‌గా ఎవరు వస్తారో అనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. అయితే ఈ సారి హోస్ట్ ఎవరు అనే దానిపై బిగ్‌బాస్ బృందం గట్టి కసరత్తే చేపట్టింది. అయితే చాలా పేర్లను పరిశీలించి మొత్తానికి ఒక హోస్ట్‌ను ప్రకటించేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో తన యాంకరింగ్‌తో అందరిని మంత్రముగ్ధుల్ని చేసి బుల్లి తెరపై తనదైన ముద్రను వేసుకున్న టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పేరును ఖరారు చేసింది. అయితే నాగర్జునలాంటి బిగ్ స్టార్ హోస్ట్ చేయడం వలన ఈ సీజన్ మరింత ఆసక్తిగా మారబోతుందని బిగ్ బాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. త్వరలోనే పూర్తి కంటెస్టెంట్లను అనౌన్స్ చేసి జూలైలో బిగ్‌బాస్‌ 3 ని ప్రారంభించబోతున్న్నట్టు బిగ్‌బాస్‌ బృందం నుంచి అందిన సమాచారం.