బిగ్‌బాస్ 3 సీజన్‌ఫై శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు..!

Sunday, October 20th, 2019, 05:42:14 PM IST

బిగ్‌ బాస్‌ 3 సీజన్ ముందు ఎంతో ఆసక్తిగా ఉన్నా రాను రాను ఎంటర్టైన్‌మెంట్ తగ్గిపోయిందనే చెప్పాలి. అయితే ఈ సీజన్లో మరో రెండు వారాల్లో విజేత ఎవరనేది తేలిపోతుంది. అయితే తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అభిమానులఅను పెద్దగా అలరించలేదనే టాక్ వినిపిస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కంటెస్టెంట్స్‌ చాలా వీక్‌గా ఉన్నారని మరో వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా బంధాలు, ఎమోషన్స్‌, ప్రేమవ్యవహారాలతో ఈ సారి షోలో వినోదం తక్కువైందని ప్రేక్షకులు వాపోతున్నారు. అంతేకాదు బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లలో కొత్తదనం లోపించిందని అంటున్నారు.

అయితే అభిమానులు ఈ సీజన్‌ చాలా బోరింగ్‌గా ఫీలవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌ విన్నర్‌ శివబాలాజీ చేసీన్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలాజీ మాట్లాడుతూ తాను ఈ బిగ్‌బాస్ సీజన్‌ను చూడటం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. అయితే తనకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే చాలా ఇష్టమని, అది ఈ సీజన్‌లో కనిపించలేదన్నాడు. అందుకే ఈ సీజన్‌ తనకు కనెక్ట్‌ కాలేదన్నాడు. ఈ సీజన్ మొదటిలో కొన్ని ఎపిసోడ్‌లు చూసినప్పుడే ఆ విషయం తనకు అర్ధమయ్యిందని, ప్రస్తుతం షూటింగ్‌, వ్యక్తిగత పనులతో బిజీగా ఉండటం వలన బిగ్‌బాస్‌ షోను మొత్తానికే చూడటం లేదని చెప్పాడు.