షాకింగ్ న్యూస్: బిగ్ బాస్3 లో ఆ ఇద్దరు శత్రువులుగా మారుతున్నారా?

Monday, October 21st, 2019, 01:13:01 PM IST

బిగ్ బాస్ రియాలిటీ షో ఫైనల్ స్టేజి కి వచ్చింది. ఇప్పటివరకు స్నేహభావంతో వున్న వరుణ్ సందేశ్ మరియు రాహుల్ గొడవపడుతున్నారు. మాటీవీ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వరుణ్ సందేశ్-రాహుల్ గొడవ వైరల్ గా మారుతుంది. టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్, ఒక్కరు మాత్రమే అర్హులు అని వాయిస్ వస్తుంది. అయితే టాస్క్ లో భాగంగా వరుణ్ సందేశ్-రాహుల్ కొట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇప్పటికే వితిక చేసిన పనికి ఒక పక్క రాహుల్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇప్పుడు వీరిద్దరి ఫైట్ తో శత్రువులుగా మారిపోయారని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు.

రాహుల్-వరుణ్, వితిక చాల రోజుల పాటు ఎంతో స్నేహభావంగా వున్నారు. వరుణ్-వితిక లా స్ట్రాటజీ కి రాహుల్ కొంత దూరం మైంటైన్ చేస్తున్నాడు. వితిక బిగ్ బాంబ్ వేయడానికి కూడా కారణాల్ని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజా సంఘటన తో వీరిద్దరూ శత్రువులుగా మారిపోయారని తెలుస్తుంది. మరి టికెట్ టు ఫైనల్ లో ఎవరు గెలుస్తారో తెలియలంటే ఈరోజు ప్రోగ్రాం చూడాల్సిందే.