షాకింగ్ : రజినీ “దర్బార్” థియేటర్స్ లో ఉండగానే టీవిలో వచ్చేసింది!

Monday, January 13th, 2020, 02:18:54 PM IST

తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజని హీరోగా నయనతార హీరోయిన్ గా నివేత థామస్ ఒక కీలక పాత్రలో అద్భుత చిత్రాల దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన పవర్ ఫుల్ కాప్ డ్రామా “దర్బార్” అటు తమిళ్,హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది.అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా చాలా స్ట్రాంగ్ వసూళ్లు రాబడుతుంది అని ట్రేడ్ పండితులు చెప్తుండగా మొత్తం చిత్ర యూనిట్ కే ఇప్పుడు ఊహించని షాక్ ఒకటి తగిలింది.

ఈ చిత్రం ఇంకా థియేటర్స్ లోకి వచ్చి వారం రోజులు పూర్తి కాకముందే టీవీ లో వచ్చేసింది.మధురై లోని ఓ ప్రాంతంలో ఎవరో కేబుల్ టీవీ ఆపరేటర్ దర్బార్ చిత్రాన్ని వారి కేబుల్ టీవిలో వేసేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు.దీనితో అలెర్ట్ అయిన రజిని అభిమానులు ఆ ఫోటో పట్టుకొని దర్బార్ చిత్ర యూనిట్ అయినటువంటి నిర్మాణ సంస్థ “లైకా ప్రొడక్షన్స్” అలాగే దర్శకుడు మురుగదాస్ సంగీత దర్శకుడు అనిరుద్ తదితరులను ట్యాగ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇది చూసిన ఇతర రజిని అభిమానులు మరియు సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.