బిగ్ బాస్ 3 : మళ్ళీ అదే రిపీట్ అవుతుందిగా…?

Friday, September 13th, 2019, 02:04:41 AM IST

బిగ్ బాస్ మూడవ సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పాలి. అంటే ఈ బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులందరు కూడా ఒక రకమైన రచ్చ చేస్తుంటే మాత్రం పేక్షకులు అందరు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూడవ సీజన్ అనేది ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. కాగా ఒకవైపు కోపాలు, తాపాలు, గొడవలు, అలకలు, మాటల యుద్దాలు మరొకవైపు ఆనందాలు, సంతోషాలు, సరదాలో ఈ హౌస్ అంత కూడా ప్రేక్షకులందరిని ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి. కాగా ప్రస్తుతానికి ఈ వారానికి గాను ఎలిమినేషన్ కి నామినేషన్ అయింది ఎవరంటే శిల్పా చక్రవర్తి, పునర్నవి, హిమజ, మహేష్ విట్టా, శ్రీముఖిలు ఉన్నారు. గత వారాలతో పోల్చుకుంటే మాత్రం ఈ సారి కూడా ఒకవేళ అదే సెంటిమెంటు కొనసాగింపుగా వస్తే మాత్రం ఈ సారి ఈ ఇంటినుండి ఎలిమినెట్ అయేది శిల్పా చక్రవర్తి అని చెప్పాలి.

అయితే ఇదివరకులాగా ఎవరైనా మొదటగా నామినేషన్ అయితే వారే ఎలిమినేట్ అవుతున్నారనేది ఆనవాయితీగా వస్తుంది. కాగా ఈసారి నామినేషన్ లో ఉన్నటువంటి శ్రీముఖి మాత్రం ఈసీజన్ కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాలి. దానికి తోడు ఆమెకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. దాదాపుగా అందరికి అభిమాన సంఘాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, గత వారంలో అలీ ఎలిమినేషన్ కి కారణమైన శిల్పా ని బయటకు పంపించాలని నెటిజన్లు అందరు కూడా కక్షతో ఉన్నారని సమాచారం. ఒకరకంగా చూసుకుంటే శిల్పా ఎలిమినేషన్ ఖాయమని కనిపిస్తున్నప్పటికీ కూడా చివర్లో మరేమైనా కొత్త మార్పులు వస్తాయేమో చూడాలి మరి.