విగ్గు వేశాలు : మొదటిరోజే బిగ్ బాస్ లో అడ్డంగా దొరికిపోయిన హేమ

Monday, July 22nd, 2019, 03:31:18 PM IST

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నిన్న ఆదివారం స్టార్ట్ అయ్యింది. 15 మంది హౌస్ మేట్స్ 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండబోతున్నారు. ఈ సారి పక్క బ్యాలన్స్ తో హౌస్ మేట్స్ ఎంపిక జరిగినట్లు తెలుస్తుంది. ఇక హౌస్ లోకి వెళ్లిన కాంటిస్టెంట్స్ లో సీనియర్ నటి హేమ ఉండటం కూడా విశేషం. మూడు నాలుగు రోజులు ముందుదాకా ఎక్కడ కూడా ఆమె పేరు వినిపించలేదు. రెండు మూడు రోజుల క్రితం జరిగిన అనూహ్య పరిణామాల మధ్య ఆమె ఎంపిక జరిగింది.

ఇక హౌస్ లోకి వెళ్లిన మొదటి రోజే ఆమె ఒక విషయంలో చిక్కింది. మొదటి రోజు బిగ్ బాస్ స్టేజి మీదకి వచ్చినప్పుడు ఫుల్ హెయిర్ తో కనిపించింది. తాజాగా ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమోలో హేమ కటింగ్ హెయిర్ తో కనిపిస్తుంది. సరిగ్గా దానినే నెటిజన్లు పట్టుకొని హేమ ఆంటీ విగ్గు పెట్టుకొని వచ్చావంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయటం స్టార్ట్ చేశారు. అయితే ఇదేమంత పెద్ద సమస్య కూడా కాదు, కానీ నెటిజన్లుకి కొంచం చిక్కిన కానీ ఏకేస్తారు. ప్రస్తుతం హేమ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. గతంలో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కూడా విగ్గుతోనే షో మొత్తం కనిపించాడు. కాకపోతే ఎప్పుడు కూడా కెమెరాకి చిక్కకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. హేమ మాత్రం మొదటి రోజే దొరికిపోయింది.