వితికని అవమానించిన బిగ్ బాస్..ఏడుపు ఒక్కటే తక్కువ

Wednesday, September 18th, 2019, 12:45:14 PM IST

నిన్న నామినేషన్ ప్రక్రియ చాలా గమ్మత్తుగా జరిగింది. ఇందులో ఈ వారం మహేష్,హిమజ,రాహుల్ మాత్రమే నామినేట్ అయ్యారు. టాస్క్ లో మహేష్, రాహుల్ మాత్రమే నామినేట్ అయ్యారు, ఇంకొకరిని నామినేషన్ కోసం సెలెక్ట్ చేయమని కెప్టెన్ అయినా వితికకి బిగ్ బాస్ చెప్పటంతో ఆమె హిమజ పేరు చెపుతుంది. దీనితో ముగ్గురు ఈ వారం నామినేషన్ అయ్యారు. ఇక ఆ టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ మరో చిన్న టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ కాలేజీ అంటూ ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో బాబా భాస్కర్,వరుణ్,వితికలు లెక్చరర్స్ గా వుంటారు. మిగిలిన హౌస్ మేట్స్ స్టూడెంట్స్ లాగా ఉంటారు.

బాబా భాస్కర్ లవాలజీ లెక్చరర్ గా, వరుణ్ చిల్లలజీ లెక్చరర్ గా, వితిక మాత్రం గాసిఫాలజి లెక్చరర్ గా వితికని నియమించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే గాసిఫాలజి లెక్చరర్ గా వితిక ఏమి చెప్పాలి అనేదాని గురించి బిగ్ బాస్ కొన్ని విషయాలు ఇచ్చాడు. అవేమిటంటే “ఇంట్లో ఎలాంటి గ్రూప్స్ ని ఎంపిక చేసుకోవాలి . గ్రూప్ లో ఎలాంటి సభ్యులను ఎంచుకోవాలి. సభ్యులకు వెన్నుపోటు ఎలా పొడవాలి, ఇంట్లో వ్యూహాత్మకంగా ప్రణాళికలను ఎలా వేయాలి, ఇంట్లో సమస్యలు సృష్టించాలి. ఇంట్లో పుకార్లు ఎలా ప్రచారం చేయాలి, పుకారాలతో ఇంటి సభ్యులను ఎలా ప్రేరేపించాలి” అనేవి వితిక అందరికి చెప్పాల్సి ఉంటుంది.

పైన చెప్పిన విషయాలు గమనిస్తే వితిక ఇలాంటివి చేయటంలో ఆమెకి బాగా అలవాటు ఉంది కాబట్టే బిగ్ బాస్ ఆమెకి ఈ టాస్క్ ఇచ్చినట్లు మనకి అర్ధం అవుతుంది. గ్రూప్స్ కట్టటం, అందులో ఎవరెవరు ఉండాలి, సభ్యులకి ఒకరికి తెలియకుండా మరొకరికి ఏమి చెప్పాలి అనే విషయాలు గతంలో వితిక చేసింది., అందుకే బిగ్ బాస్ ఆమె ఈ టాస్క్ ఇచ్చాడు. ఇక వితికకి ఇలాంటి టాస్క్ రావటంతో హౌస్ మేట్స్ అందరు సరైన టాస్క్ వచ్చిందే అని అనుకున్నారు.