అక్కడ కూడా కోరికలు తీర్చలసిందేనా..! బిగ్ బాస్ రోహిణి సంచలన వ్యాఖ్యలు

Thursday, August 22nd, 2019, 03:00:50 PM IST

బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారలు సందడి చేసి గత వారం ఎలిమినేట్ అయిన రోహిణి కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఆసక్తి కరమైన సంఘటనలు చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్ల ఉందని, కేవలం సినిమాల్లోనే కాదు, సీరియల్స్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని, ఆమె కూడా మూడు నాలుగు సార్లు అలాంటివి పేస్ చేసిందని చెప్పుకొచ్చింది.

బీటెక్ పూర్తియైన తర్వాత ఎస్ ఆర్ నగర్ లో ఉంటూ అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో మొదటిగా రెండు ఆఫీస్ లకి అవకాశాల కోసం వెళితే, అక్కడ ఉన్న వాళ్ళు తమ కోరికలు తీర్చమని అడిగారని, దానికి ఆమె ఇచ్చిన సమాధానం విని ఆగిపోయారు, ఆ తర్వాత అక్కడి నుండి ఎలాంటి సమాధానం రాలేదని, అది జరిగిన కొన్ని రోజుల తర్వాత మరో ఆఫీస్ కి వెళితే నాకంటే వయస్సులో పెద్దాయన నీకు కావాల్సింది నేను ఇస్తాను, మరి మాకేమి ఇస్తామంటూ డైరెక్ట్ గా అడిగాడంటూ చెప్పింది.

ఆమె చెప్పిన దానిని బట్టి చూస్తే ఆడపిల్ల ఏ రంగంలో ఉంటే అక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది తప్పకుండా ఉంటుందనేది అర్ధం అవుతుంది. సీరియల్స్ ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు, ఫేమ్ కావచ్చు తక్కువే అయినప్పటికీ కూడా కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా స్థాయిలోనే ఉంటుందనేది తెలుస్తుంది. మరి బిగ్ బాస్ విషయంలో కాస్టింగ్ కౌచ్ మీద ఆరోపణలు వచ్చాయి. అయితే దాని గురించి మాత్రం రోహిణి చెప్పలేదు.